Manikandan dubbed for his role in Telugu True lover: జై భీమ్, గుడ్ నైట్ వంటి సినిమాలతో మణికందన్ తెలుగు వారికి కూడా దగ్గర అయ్యాడు. అలాగే జై హీరోగా నటించిన మతగం అంటూ వెబ్ సిరీస్‌లో విలన్‌గా కనిపించి భయపెట్టాడు. మణికందన్ చేసిన లవర్ అనే సినిమాను మారుతి, ఎస్ కే ఎన్ తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. మణికందన్, శ్రీ గౌరి ప్రియ కాంబోలో ట్రూ లవర్ అనే సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ మీద రిలీజ్ కాబోతోంది. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని రూపొందించారు.
Shivani Nagaram : ఫ్రెండ్ పాత్ర అనుకుని వెళ్తే “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”కి హీరోయిన్ ను చేసేశారు!
ఈ సినిమాను తెలుగులోకి మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ కలిసి రిలీజ్ చేస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రూ లవర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే బేబీ లాగే ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇక తెలుగులో తన పాత్రకు మణికందన్ డబ్బింగ్ చెప్పినట్టు ప్రకటించారు. పూర్తిగా తెలుగు రాకపోయినా ఆయన తెలుగులో మెగాస్టార్ సినిమాలన్నింటిని చూసి, భాషను నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ తెలుగు నేర్చుకునే విషయంలో తన కాలేజీ స్నేహితుడు రాకేందు మౌళి కూడా ఆయనకి సహాయం చేశాడట.