Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sailesh Kolanu: సముద్రం నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదని దర్శకుడు శైలేష్ కొలను అన్నారు. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం, సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే పూర్తి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా థియేటర్‌కు వెళ్లాలంటే ప్రేక్షకులు ఎన్నో కారణాలు ఆలోచించే పరిస్థితి ఉందని చెప్పారు. అయితే ‘మండాడి’లో సూరి, సుహాస్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేంత ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. సముద్రం, పడవ పందెం నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని మేకర్స్ సృష్టించారని చెప్పారు.
ముఖ్యంగా సముద్రంలో షూటింగ్ చేయడం చాలా కష్టమైన విషయమని శైలేష్ అన్నారు. ఒక చిన్న సీక్వెన్స్ చిత్రీకరించడానికి కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. పడవలను ఫాలో అవుతూ మరో పడవపై కెమెరాలతో చిత్రీకరించడం, సముద్రంలో పడవల కదలికలు మారడం, లైటింగ్ మారిపోవడం వంటి సమస్యల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా మొత్తాన్ని సముద్రంలో చిత్రీకరించిన టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఇక సుహాస్ గురించి మాట్లాడుతూ.. సుహాస్‌లో విలన్ని చూసిన చాలా కొద్ది మంది డైరెక్టర్స్‌లో నేను ముందు వరుసలో ఉంటాను. కానీ సుహాస్ నన్ను మోసం చేశాడు. ఆయనను మొదట విలన్‌గా దాచిపెట్టాలనుకున్నామని, కానీ తన నటనతో సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారని శైలేష్ అన్నారు. ముఖ్యంగా తన హిట్ 2 సినిమాలో చివరి 15 నిమిషాల్లో సుహాస్, శేష్ చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. సుహాస్ తనకు కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Also Read
- The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
- Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
ఇక ఈ సినిమా హీరోయిన్ మహిమా నంబియార్ విలేజ్ గర్ల్‌గా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని శైలేష్ తెలిపారు. అలాగే రవీంద్ర విజయ్, సత్యరాజ్ వంటి నటుల పెర్ఫార్మెన్స్ను ప్రశంసించారు. డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సహా మొత్తం టెక్నికల్ టీమ్ అద్భుతంగా పనిచేసిందన్నారు. ప్రస్తుతం సినిమాల మధ్య భాషల సరిహద్దులు చెరిగిపోయాయని, కంటెంట్‌నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని శైలేష్ కొలను అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 10న ‘మండాడి’ని పెద్ద స్క్రీన్‌పై, ముఖ్యంగా ఎపిక్ ఫార్మాట్లో చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులను కోరారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!