రామచంద్ర తెలుగు సినిమాల్లో పనిచేసి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ప్రత్యేకించి వెంకీ సినిమాలో అతని నటన ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం సమస్యతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది, మరియు ఆయన ఆరోగ్యం గురించి ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ ఈ సందర్భంగా రామచంద్రకు మద్దతుగా నిలబడి,రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్.
Also Read : Shivani Nagaram : కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చి ఉండొచ్చు కానీ
ఈ రోజు (సెప్టెంబర్ 2, 2025) హైదరాబాద్‌లో రామచంద్ర ఇంటికి వెళ్లి మనోజ్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రామచంద్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆదరణ తెలిపారు. రామచంద్ర అనారోగ్యం విషయం మనోజ్‌కు ఆయన సోదరుడి ద్వారా తెలిసిందని మనోజ్ తెలిపారు. ఈ రోజు హైదరాబాద్‌లోని రామచంద్ర నివాసానికి చేరుకుని, ఆయనను కలిసిన మనోజ్, ఆరోగ్యం గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి, రామచంద్రకు త్వరగా మంచి ఆరోగ్యం వచ్చి, మళ్లీ సినిమాల్లో కనిపించాలని ఆశ వ్యక్తం చేశారు.