Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lock Upp 2: ప్రేమలో మోసం ఎదురైతే మనసు ఎంతగా విరిగిపోతుందో మాటల్లో చెప్పడం కష్టం. అలాంటి చేదు అనుభవాన్ని ప్రముఖ మోడల్ పమేలా సెరెనా కన్నీళ్లతో పంచుకుంది. ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో తన గత జీవితాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం వరకు వెళ్లిన ప్రేమకథ ఎలా ఒక్క ఫోన్ కాల్తో కూలిపోయిందో ఆమె వెల్లడించింది. ఫినాలే దశకు చేరుకున్న ‘లాక్ అప్ 2’లో నిర్వహించిన సీక్రెట్ రివీల్ టాస్క్ సందర్భంగా ప్రతి కంటెస్టెంట్ తమ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనలను పంచుకున్నారు. ఈ క్రమంలో మోడల్ పమేలా సెరెనా తన ఎనిమిదేళ్ల ప్రేమకథ గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. ఆమె కథ విన్న తోటి కంటెస్టెంట్లు కూడా షాకయ్యారు.
పమేలా తెలిపిన వివరాల ప్రకారం, ఐదేళ్ల క్రితం ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె ఎనిమిదేళ్ల పాటు ప్రేమ కొనసాగింది. ఇరు కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం కూడా పూర్తై, పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన అతడు తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరగా, పరీక్షల్లో కడుపులో పుండు పగిలినట్లు తేలడంతో అత్యవసర శస్త్రచికిత్స చేశారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అతని మొబైల్ ఫోన్ తన వద్దే ఉందని పమేలా తెలిపింది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, గత రెండేళ్లుగా అతడు తనతో ప్రేమలో ఉన్నాడని, ప్రస్తుతం తాను గర్భవతినని ఆమె చెప్పడంతో తన ప్రపంచమే కుప్పకూలిపోయిందని పమేలా కన్నీటి పర్యంతమైంది.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
అంతటి మోసం తెలిసినా, ఆసుపత్రి బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆ పరిస్థితిలో వదిలి వెళ్లలేకపోయానని ఆమె చెప్పింది. మరో నెలన్నర పాటు అతడి వద్దే ఉండి సేవలు చేసి, పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే తన సామాను సర్దుకుని శాశ్వతంగా ఆ బంధానికి ముగింపు పలికానని వెల్లడించింది. ఆ సంఘటన తర్వాత ఎవరినీ పూర్తిగా నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిటన్లో జన్మించిన పమేలా సెరెనా, మిసెస్ యూనివర్స్ దుబాయ్ 2021, మిసెస్ యూఏఈ వరల్డ్ 2022 కిరీటాలను గెలుచుకుంది. అనంతరం నెట్ఫ్లిక్స్ రూపొందించిన ‘దేశీ బ్లింగ్’ షో ద్వారా మరింత గుర్తింపు సంపాదించింది. ఇదిలా ఉండగా, ఫరా ఖాన్, రితేష్ దేశ్ముఖ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్ 2’ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. ఫినాలే సమీపిస్తున్న వేళ హర్షద్ చోప్రా, యోగేష్ రావత్ రీ ఎంట్రీతో హౌస్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. పమేలా వెల్లడించిన వ్యక్తిగత అనుభవం ఈ సీజన్లో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా నిలిచింది.
- Tags
- cinema
- Pamela Serena
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..