ఈ మధ్య కాలంలో కుర్రాళ్ల ఫేవరెట్ క్రష్ ఎవరంటే అందరూ చెప్పే పేరు మమితా బైజు. ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అయితే క్రేజ్‌తో పాటు అమ్మడికి లవ్ ప్రపోజల్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయట. తాజాగా వీటిపై స్పందించిన మమితా.. తన పర్సనల్ విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకుంది.
Also Read : Samantha Marriage: 3 రోజులకే శుభవార్త.. సమంత పెళ్లిపై.. బాలీవుడ్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్!
మమితా మాట్లాడుతూ.. “ప్రేమలు సినిమా హిట్ అయ్యాక నాకు లవ్ ప్రపోజల్స్ రావడం బాగా ఎక్కువైపోయింది. కొందరైతే ఎలాగోలా నా నంబర్ పట్టుకుని మరీ మెసేజ్‌లు చేస్తున్నారు. కానీ నాకు మాత్రం వాటిని చదివే టైమ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ అస్సలు లేవు. అందుకే ఆ బాధ్యతలన్నీ మా అన్నయ్య మిథున్‌కు అప్పగించేశా. తను స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్. మా మధ్య అన్నాచెల్లెళ్ల రిలేషన్ కంటే ఫ్రెండ్ షిప్ ఎక్కువ. నా ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లు, సోషల్ మీడియా కామెంట్లు అన్నింటినీ తనే చూస్తాడు. ఎవరికి ఏ రిప్లై ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేస్తాడు” అని చెప్పింది. అంతే కాదు..
తన లైఫ్‌లో అన్నయ్య ఇచ్చే సలహానే ఫైనల్ అని మమితా అంటోంది. ‘నేను ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా అన్నయ్యను అడగకుండా అడుగు కూడా బయట పెట్టను. చివరకు నా పెళ్లి ఎవరితో జరగాలి? ఎప్పుడు జరగాలి? అనేది కూడా మా అన్నయ్యే ఫిక్స్ చేస్తాడు. ఆయన ఎవరిని చూపిస్తే వారినే నేను పెళ్లి చేసుకుంటా’ అని తన అన్నయ్యపై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం మమితా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.