డేరింగ్ అండ్ డాషింగ్ గా తెలుగు సినిమా రేంజ్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళిన సూపర్ స్టార్ కృష్ణ. సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ నేడు 78వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈరోజు తన తండ్రి కృష్ణ పుట్టినరోజున సందర్భంగా మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహింపజేశారు. టీకా డ్రైవ్ ప్రారంభమైన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు తరచుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. 1,000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు మహేష్. మహేష్ బాబు హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్‌తో కలిసి పేదలకు ఆర్థిక సహాయం, వైద్య ఖర్చులను భరించలేని వ్యక్తులకు సపోర్ట్ ను అందిస్తారు.