Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
- ‘వారణాసి’తో బిజీగా ఉన్న మహేష్ బాబు
- సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్
- ‘బ్లాక్ ఫారెస్ట్’ ప్రాంతంలో సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్ దొరకడంతో బాబు విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తదుపరి షెడ్యూల్ ఏర్పాట్ల కోసం వెళ్లారా? లేదా వ్యక్తిగత పర్యటనా? అనే సందేహాలకు తెరదించుతూ.. మహేష్ స్వయంగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ జర్మనీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ‘బ్లాక్ ఫారెస్ట్’ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ చేస్తూ, సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ హ్యారీతో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతంలో ‘గుంటూరు కారం’ విడుదల తర్వాత కూడా మహేష్ ఇదే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడం గమనార్హం.
Also Read
రాజమౌళి-మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను అంటార్కిటికాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి, కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొనడానికి అవసరమైన ఫిట్నెస్ కోసమే మహేష్ ఈ ముందస్తు శిక్షణ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా రాజమౌళి మార్క్ మేకింగ్, గ్లోబల్ యాక్షన్ స్టాండర్డ్స్ కలవడంతో వారణాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?