Mahesh babus mother passes away: సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. అయితే.. ఇటీవలే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఇవాళ ఇందిరాదేవి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది…మరోవైపు ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ఇందిరా దేవి పార్దీవ దేహానికి వెంకటేష్ , నాగార్జున, మురళీ మోహన్, జీవితా, అల్లు అరవింద్, మాగంటి గోపినాధ్ ,బండ్ల గణేష్ , కొరటాల శివ ,అశ్వనీదత్ , నందమూరి రామకృష్ణ , త్రివిక్రమ్ శ్రీనివాస్ , సునీల్ నారంగ్, కిరణ్, మోహన్ బాబు, మంచు విష్ణు, జూ.ఎన్టీఆర్ తదితరులు నివాళులు అర్పించారు.
ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేష్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసాని వెళ్లి కృష్ణను, మహేష్ బాబును పరామర్శించారు. మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి కేటీఆర్.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేష్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ బాధ నుండి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ…ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/9EGjusSKGA
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2022
Deepest condolences to #krishna garu @urstrulyMahesh and his family🙏 #ripindiradevigaru
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 28, 2022
ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను-నందమూరి బాలకృష్ణ
శ్రీ కృష్ణ గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు జననేత పవన్ కళ్యాణ్. ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను.
Deeply saddened by the passing away of Indira Devi Garu. Deepest condolences to Krishna garu, Mahesh anna and family in this time of grief.
— Jr NTR (@tarak9999) September 28, 2022