బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా, డ్యాన్స్ ఐకాన్‌గా ఎన్నో దశాబ్దాలుగా మెప్పిస్తోన్న మాధురీ దీక్షిత్ ఇప్పుడు ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘మా బెహెన్’ లో త్రిప్తి దిమ్రికి తల్లిగా కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా ఉండటమే కాకుండా, సినిమా హైలైట్‌గా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాల టాక్.
Also Read : Dhanush : మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో ధనుష్ న్యూ ప్రాజెక్ట్ !
‘మా బెహెన్’ చిత్రాన్ని సురేశ్ త్రివేణి తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వం శైలి ఫ్యామిలీ విలువలు, భావోద్వేగాలు, హాస్యాన్ని సమతూకంగా చూపిస్తారు. ఈ కథ కూడా తల్లీకూతుళ్ల బంధం చుట్టూ తిరగబోతోందని సమాచారం. అయితే ఇది సాధారణ కథ కాదు. కుటుంబ సంబంధాల్లో తరతరాల మధ్య వచ్చే విభేదాలు, వారసత్వం వల్ల తలెత్తే ఘర్షణలు, వాటిలో ఉండే ప్రేమను వినోదాత్మకంగా చూపించబోతున్నారు. అందుకే ఈ సినిమా ఒక వైపు ఫ్యామిలీ డ్రామాగా ఉంటే, మరో వైపు ఆడియన్స్‌కి లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుంది. ఇప్పటికే మాధురి – త్రిప్తి కాంబినేషన్‌ను ప్రేక్షకులు భూల్ భులయ్యా 3లో చూశారు. ఆ సినిమాలో వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగా నచ్చడంతో, ఇప్పుడు మా బెహెన్ లో ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం సినీ అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఈ సినిమాలో మాధురి – త్రిప్తి మాత్రమే కాకుండా, శార్దూల్ భరద్వాజ్, రవి కిషన్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం మీద ఈ మూవీ మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతూ, ప్రేక్షకులకు ఫుల్ ఎమోషన్‌తో పాటు కామెడీ డోస్ కూడా అందించనుందని టీమ్ చెబుతోంది.