మే 8న గ్రాండ్ రిలీజ్ కానున్న M4M థ్రిల్లర్.. సీరియల్ కిల్లర్‌ను కనిపెడితే రూ.లక్ష ఫ్రైజ్ మనీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M4 MMovie: అమెరికన్ నటి జోశర్మ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్.ఆదిత్య, వి.సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. మోహన్ వడ్లపట్ల తన టీమ్‌తో కలిసి గొప్ప టాలెంట్‌ను వెండి తెరపైకి తీసుకొచ్చారని ప్రశంసించారు. జోశర్మకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అనంతరం దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా మే 8న విడుదల రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని అన్నారు. మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలని కోరుకున్నారు. హీరోయిన్ జోశర్మ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు మోహన్ వడ్లపట్లకు థాంక్స్ చెప్పారు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి 15కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమాను చూసి హిట్ చేయాలని కోరారు. అనంతరం దర్శక – నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి రూ.లక్ష క్యాష్ ప్రైజ్ ప్రకటించినట్లు తెలిపారు. M4M యూనివర్సల్ సబ్జెక్ట్ అని, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని, ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నామని చెప్పారు. మొత్తానికి ఆసక్తికరమైన కథాంశం, కొత్త కాన్సెప్ట్‌తో M4M చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!