మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ అంశం మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది. తాజాగా ఈ అంశం మీద విచారణ జరిపిన హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
ప్రీమియర్ షో లకు అనుమతి లేదని, టికెట్ ధరలు భారీగా ఉండటం నిబంధనలకు విరుద్ధం అని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. రోజుకి 5 షోలు మాత్రమే జీవో ప్రకారం ఇవ్వాల్సి ఉండగా 6 షోలకు అనుమతి ఇచ్చారు అంటూ పిటిషన్ దాఖలు చేశారు. 100 కోట్లు నిర్మాణ వ్యయం అవకుండా అయ్యాయని నిర్మాతలు చెబుతున్నారని దీనిపై ఈడీ విచారణ చేయాలని పిటిషన్ లో కోరారు పిటిషనర్. ఇక ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ప్రీమియర్ షో రేటు ఎక్కువ అనిపిస్తే దానికి వెళ్లొద్దని పిటిషనర్ కి సూచించాలన్న హైకోర్టు ధరలు పెంచుకోవడానికి ఎన్ని రోజులు అనుమతి ఇవ్వాలనే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి అని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.