Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
- బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఆదిత్య 369
- సీక్వెల్ కోసం అభిమానుల ఎదురుచూపులు
- హీరో మోక్షజ్ఞ తేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని ఇప్పటికే బాలయ్య బాబు పలుమార్లు చెప్పారు. తాజాగా సీక్వెల్ విశేషాలు అభిమానులతో పంచుకున్నారు.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాపులర్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్’. ప్రస్తుతం సీజన్ 4 కొనసాగుతోంది. తాజాగా షోకి సంబందించిన లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ఆదిత్య 369 సినిమా గెటప్‌లో బాలయ్య బాబు స్టేజ్‌పై సందడి చేశారు. సీక్వెల్ విశేషాలు కూడా పంచుకున్నారు. ‘ఆదిత్య 369 చిత్రంకు సీక్వెల్‌గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆదిత్య 999 పట్టాలెక్కుతుంది’ అని బాలకృష్ణ తెలిపారు. ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. అప్పుడు మరిన్ని విషయాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలిసిన నందమూరి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
Also Read: Asia Cup 2024: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. సెమీస్‌కు భారత్!
మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఇది రెకక్కుతోంది. ఈ సినిమా కోసం డ్యాన్స్, యాక్షన్‌లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం అనంతరం ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆదిత్య 369 తెరకెక్కిన విషయం తెలిసిందే. హీరో భూతకాలం, భవిష్యత్‌లోకి ప్రయాణిస్తే.. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతో రూపొందింది. బాలయ్య బాబు సినీ ప్రస్థానంలోనే ఆదిత్య 369 ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!