ప్రముఖ దర్శకుడు జిఎన్ రంగరాజన్ ఈ రోజు కన్నుమూశారు. జూన్ 3న ఉదయం 8.45 గంటలకు ఆయన వయసు సంబంధిత అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన వయసు 90. ఆయన తుది కర్మలు ఈ రోజు చెన్నైలో జరగనున్నాయి. రంగరాజన్ కుమారుడు జిఎన్ఆర్ కుమారవెలన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు. కుమారవెలన్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రి తుదిశ్వాస విడిచిన విషయాన్నీ వెల్లడించారు. “నా తండ్రి, నా గురువు, నా ప్రేమ … ఈ రోజు ఉదయం 8.45 గంటలకు కన్నుమూశారు. నా కుటుంబాన్ని బలోపేతం చేయడానికి మీ ప్రార్థనలన్నీ కావాలి” అంటూ జిఎన్ఆర్ కుమారవెలన్ తండ్రి మృతి గురించి తెలిపారు. ఈ విషయం తెలిసిందే తమిళ సినీ ప్రముఖులు జిఎన్ఆర్ కుమారవెలన్ కుటుంబానికి సంతాపం పంపుతున్నారు. రంగరాజన్ మీండుమ్ కోకిలా, కళ్యాణ రామన్, మహారాసన్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. జిఎన్ రంగరాజన్ నటుడు కమల్ హాసన్‌తో మీండుమ్ కోకిలా (1981), మహారాసన్ (1993) వంటి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు. ఇంకా కళ్యాణరామన్, ఎల్లమ్ ఇన్బామాయం, కదల్ మీంగల్, ముత్తు ఎంగల్ సోతు, పల్లవి మీండుమ్ పల్లవి, అదుతతు ఆల్బర్ట్ తదితర చిత్రాలను ఆయన రూపొందించారు.