Lavanya Drunk Driving Case: నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది.. మద్యం మత్తులో లావణ్య హంగామా!
- మద్యం మత్తులో హంగామా చేసిన లావణ్య
- మల్లేపల్లి గ్రామస్థులతో లావణ్య వాగ్వాదం
- నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది అంటూ కేకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Skips Court Today in Drunk Driving Case: సంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య చేసిన హంగామా సంచలనంగా మారింది. బుధవారం కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామం వద్ద జరిగిన ఘటనలో ఆమె కారుతో ఒక బైక్‌ను ఢీకొట్టడం, అనంతరం గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.
లావణ్య కారులో బీరు బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఆమెకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 140 పాయింట్లు నమోదవ్వడంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొండాపూర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఈ రోజు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. లావణ్య గైర్హాజరయింది.
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
Also Read: Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరంటే?
లావణ్య మల్లేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను తన కారుతో ఢీకొట్టింది. ఆపై పారిపోయే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని గ్రామస్థులు కోరగా.. వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. ‘నేను ఎవరో తెలుసా?’ అంటూ తిరిగింది. తాను సెలబ్రిటీనని, తనను ఆపే హక్కు ఎవరికీ లేదంటూ హెచ్చరించారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నాయకులతో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరింపులకు కూడా దిగింది. తన కారును అడ్డుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని లావణ్య గ్రామస్థులను భయపెట్టింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ప్రవర్తించినలావణ్య తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!