శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తుండగా. ఈ జూన్ 20, 2025 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే..
Also Read : Sreeleela : శ్రీ లీల బర్త్ డే స్పెషల్.. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరగడంతో ఈ వేడుకను వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ వేడుకకి సంబంధించి కొత్త డేట్‌ని ప్రకటించారు. కుబేరా ప్రీ రిలీజ్ వేడుకను జూన్ 15న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి రేపు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ లాంచ్‌తో సినిమాపై మరింత హైప్ పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.