సూపర్ స్టార్ ధనుష్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. ఇటీవల స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సూపర్ హిట్ సాధించడంతో రెట్టించిన ఉత్సహంతో సినిమాలు చేస్తున్నాడు ధనుష్. టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా సార్ హిట్ తో మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధనుష్ మరియు కింగ్ నాగార్జున కాంబోలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకేక్కిస్తున్న చిత్రం కుబేర. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నహీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపెయిన్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
Also Read: Vettaiyan : వేట్టయాన్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ .. రిలీజ్ వాయిదా పడే అవకాశం.?
తాజా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్‌లో ధనుష్ మరియు నాగార్జున పోషించిన
క్యారెక్టర్స్ ను పరిచయం చేసారు. ధనుష్ చిందరవందరగా ఉన్న జుట్టు మరియు మాసిన గడ్డంతో, కష్టాలు అనుభవిస్తున్న జీవితాన్ని అనుభవించే బిచ్చగాడిలా చూపించారు. అపర సంపద కలిగిన కుబేరుడి పాత్రలో నాగార్జునను చూపించారు. ఈ పోస్టర్ సినిమా నేపథ్యాన్ని తెలిపేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కుబేర చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో బహుభాషా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.