Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్యాషన్ ఐకాన్ కృతి సనన్ మరోసారి తన అద్భుతమైన స్టైల్‌తో అభిమానులను ఫిదా చేశారు. ‘ది బ్రైడ్ సైడ్’ సీజన్ 6 – ‘సోలార్ ది ఫస్ట్ లైట్’ క్యాంపెయిన్ కోసం కృతి ధరించిన ‘సైరన్ బ్లూమ్’ ఐవరీ క్యూచర్ లెహంగా ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ రాయల్ అవుట్‌ఫిట్‌ను తయారుచేయడానికి నిపుణులైన డిజైనర్లు సుమారు 680 గంటల సమయం కేటాయించడం విశేషం. అంతేకాకుండా 3,000 పైగా మెరిసే క్రిస్టల్స్, ఫ్లోరల్ అప్లికే మరియు సన్నని హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ దుస్తులను అత్యంత రమణీయంగా రూపొందించారు. మినిమల్ జ్యువెలరీ, సాఫ్ట్ మేకప్‌తో మోడర్న్ గ్లామర్‌తో ఉన్న కృతి లుక్‌పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కృతి సనన్ ఒకవైపు గ్లామర్ ప్రపంచం, మరోవైపు వరుస భారీ ప్రాజెక్టులతో బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘డాన్ 3: ది ఫైనల్ చాప్టర్’లో కృతి సనన్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రం 2026 చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కామెడీ సీక్వెల్ ‘నో ఎంట్రీ 2’లోనూ కృతి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇవే కాకుండా పాన్-ఇండియా రేంజ్లో మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌లు కృతి ఖాతాలో ఉన్నాయి. గతంలో మంచి విజయం సాధించిన క్రీచర్-కామెడీ హారర్ హిట్ చిత్రం సీక్వెల్ ‘భేడియా 2’లో ఆమె నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి అటు ఫ్యాషన్ ఐకాన్‌గా, ఇటు వరుస బిగ్-బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లీడింగ్ హీరోయిన్గా కృతి సనన్ తన సత్తా చాటుతున్నారు.
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
తాజావార్తలు
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?