AIG Doctors: కృష్ణంరాజు మృతి కారణం అదే.. ఏఐజీ వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Raju has severe pneumonia in his lungs: సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీనిపై ఏఐజీ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. కృష్ణంరాజుకు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కృష్ణంరాజు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు కృష్ణంరాజు కాలుకు గతేడాది శస్త్రచికిత్స జరిగిందని అన్నారు. కొవిడ్ అనంతరం ఆనారోగ్య సమస్యలతో ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో చేరారని స్పష్టం చేశారు. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఏర్పడిందని, కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించామన్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారని ఏఐజీ వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు తెలుగు సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కృష్ణంరాజు.
Krishnam Raju Funeral Rites: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎస్‌కు ఆదేశించిన సీఎం కేసీఆర్
Also Read
- The Odyssey : 'ది ఒడిస్సీ'కి ఎందుకంత భయపడుతున్నారు?
- Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
- Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్‌పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?