మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న యంగ్ హీరోలో వరుణ్ తేజ్ ఒకరు. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటకి హిట్ మాత్రం పడటం లేదు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుస సినిమాలు తీసుకున్నప్పటికి అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేక పోతున్నాడు. కాగా ప్రస్తుతం వరుణ్ హీరోగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వరుణ్ తేజ్ కు 15వ చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారు.
Also Read: Tamannaah : ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం
ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రాబోతున్న ఈ మూవికీ ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఆదివారం (మార్చి 23) ఈ సినిమా ప్రారంభం కానుంది. మరి, ఓపెనింగ్ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తారో? లేదో? అనే విషయం తెలియాల్సి ఉంది. అలాగే మిగతా నటీనటుల గురించి అప్ డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్ర షూటింగ్ మెజారిటీగా కొరియా, వియాత్నం నగరాల్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అయిన వరుణ్ హిట్ కొడతారో చూడాలి.