మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనున్నాడు. అతని స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అతని పాత్రపై అంచనాలను పెంచింది. మరోవైపు చరణ్ ‘ఆచార్య’లో చిరు కుమారుడిగా కనిపిస్తాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే చిరు, చరణ్ తన సినిమాలో తండ్రి, కొడుకులుగా నటించడం లేదని కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక చరణ్ 20 నిమిషాల అతిధి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలను కూడా కొట్టిపారేశాడు కొరటాల. ఈ చిత్రంలో పూర్తి స్థాయి రచయితగా సపోర్టింగ్ రోల్ లో చరణ్ కనిపిస్తాడని కొరటాల శివ ధృవీకరించాడు.