ఆగస్ట్ 4న బాలీవుడ్ లెజెండ్రీ సింగర్ కిషోర్ కుమార్ 92వ జయంతిని మధ్యప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం ఖాంద్వాలో కిషోర్ సమాధి అభిమానులు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. మరోవైపు, కొందరు కిషోర్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన పుట్టిన ‘గంగూలీ హౌజ్’ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కుమార్ బ్రదర్స్ గా ఫేమస్ అయిన అశోక్ కుమార్, కిషోర్ కుమార్, అనూప్ కుమార్ ఇంటి పేరు గంగూలీ. అయితే, వారు పుట్టిన అలనాటి ఇల్లు ఇప్పుడు పాడుబడిపోయి ఉంది. ఈ తరం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలతో పట్టించుకునే వారు లేరు. అందుకే, ప్రభుత్వం చొరవ చూపి కిషోర్ కుమార్ జన్మించిన ఖాంద్వా గ్రామంలోని చారిత్రక గృహాన్ని వారసత్వంగా ప్రకటించాలని అభిమానులు కోరుతున్నారు. ఖాంద్వా జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా కిషోర్ కుమార్ సమాధికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. చూడాలి మరి, కిషోర్ కుమార్ ఫ్యాన్స్ చేస్తోన్న డిమాండ్ ని ప్రభుత్యాలు ఎంత వరకూ పరిగణిస్తాయో…