Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు.
ఆగస్ట్ 4న బాలీవుడ్ లెజెండ్రీ సింగర్ కిషోర్ కుమార్ 92వ జయంతిని మధ్యప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం ఖాంద్వాలో కిషోర్ సమాధి అభిమానులు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. మరోవైపు, కొందరు కిషోర్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన పుట్టిన ‘గంగూలీ హౌజ్’ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని �
(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి) గాయకునిగా కిశోర్ కుమార్ బాణీ విలక్షణమైనది. కిశోర్ గళం కిర్రెక్కించేది. ఆయన పాట పరవశింప చేసేది. నటన మత్తు చల్లింది. కిశోర్ పాటతోనే దేవానంద్, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్స్ వెలిశారు. కిశోర్ గానంతోనే అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. కిశోర్ గాత్రంలోని