కిరణ్ రాథోడ్.. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దగా పరిచయం లేకపోయినా ‘ నువ్వు లేక నేను లేను ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈవిడ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈవిడ కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా అదరగొట్టింది. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లోనూ నటించింది ఈ భామ. నిజానికి ఈవిడ హీరోయిన్ కంటే చాలా వరకు స్పెషల్ సాంగ్స్ లోనే ఆడిపాడిందని చెప్పవచ్చు. తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్, కమల్ హసాన్ వంటి స్టార్ హీరోల సరసన స్టెప్పులేసింది. అయితే ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే తెలుగులో నిర్వహించిన బిగ్ బాస్ సీజన్ 7 లో ఈవిడ పాల్గొంది. కాకపోతే ఈ సీజన్ లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.
Also Read: Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లతో సహా ఏడుగురి మృతి
ఇది ఇలా ఉండగా.. ఇకపై ఈ హాట్ బ్యూటీ మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను సినిమాలకు దూరం అవ్వడానికి గల కారణం తన ప్రియుడు కిరణ్ రాథోడ్ అని తెలిపింది. తన ప్రియుడు చెప్పడంతోనే తాను సినిమాలకు బ్రేక్ ఇచ్చానని.. అతను పూర్తిగా సినిమాలను వదిలేయమన్నాడని తెలిపింది. కాకపోతే అతని మాటలు విని తాను చాల పెద్ద తప్పు చేశానని., ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి నటించడానికి ప్రయత్నిస్తునట్లు తెలిపింది.
Also Read: Om Bheem Bush : ‘ఓం భీం బుష్ ‘ లో మెరిసిన నలుగురు ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?
కాకపోతే ఇప్పుడు సినిమాల్లో ప్రయత్నిస్తుంటే తనను కొంతమంది తప్పుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. కొందరైతే అడ్జెస్ట్మెంట్ అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఇంతటి కష్టసమయంలోనే తన ప్రియుడు తనని వదిలేశాడని తెలిపింది. అంతేకాకుండా ఓసారి తన ప్రియుడు తనను కొట్టాడడని కూడా చెప్పుకొచ్చింది. అయితే అదే తాను సహించలేకపోయిందట. ఆ తర్వాత తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని పిలిచి.. కసితీరా కొట్టి పంపించిందట ఈ వయ్యారి. ఇక అప్పడి నుండి కొందరు ఇండస్ట్రీలో తప్పుడు ఉద్దేశంతో తనను వాడుకోవాలనుకున్నారని తెలిపింది. దీనితోనే తనకు సినిమా అవకాశాలు దూరమయ్యాయి అని తెలిపింది.