Site icon NTV Telugu

K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు

Kiran Abavara K Ramp

Kiran Abavara K Ramp

యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు అధికంగా రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే “K-ర్యాంప్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలకు ముందు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో బలమైన క్రేజ్‌ను సృష్టించాయి. ఆ ప్రచారం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఫలించింది.

Also Read :Mass Jathara : ధనుష్ ప్లేస్‌లో రవితేజా? షాక్ ఇచ్చిన దర్శకుడు..

“K-ర్యాంప్” సినిమాకు విమర్శకుల (క్రిటిక్స్) నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వసూళ్లకు, రివ్యూలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. రివ్యూలతో సంబంధం లేకుండా మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. “రిచ్చెస్ట్ చిల్లర్ గయ్” అనే వినూత్నమైన క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం నటన, ఆయన పర్‌ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

Also Read :Vishal: విశాల్.. ఇవే తగ్గించుకుంటే మంచిది!

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై నిర్మాతలు రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటులు వీకే నరేష్, సాయికుమార్, అలాగే వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ కీలక పాత్రలతో సినిమా విజయంలో పాలుపంచుకున్నారు.

Exit mobile version