మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతున్న ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె కెమిస్ట్రీ రవితేజతో చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది.
Also Read : Daksha: OTT టాప్ ట్రెండ్ లో దూసుకుపోతున్న మంచు లక్ష్మి ‘దక్ష’..
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాడు. అందులో మాట్లాడుతూ, వెంకీ అట్లూరి ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. తన హిట్ మూవీ ‘సార్’ (Sir / Vaathi) కోసం మొదటగా ధనుష్ కాదు, రవితేజని అనుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు..వెంకీ మాట్లాడుతూ “కోవిడ్ కాలంలో నేను రవితేజ అన్నకు ఫోన్ చేశా. ‘సార్’ కథ చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది కానీ ఆ సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో ఆ ప్రాజెక్ట్ షెడ్యూల్ కుదరలేదు. తర్వాత ఆ రోల్‌కి ధనుష్‌ను ఫైనలైజ్ చేశాం” అని తెలిపారు. ఇది విన్న తర్వాత రవితేజ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ‘సార్’ సినిమాలో చూపించిన ఎమోషనల్ లెవెల్, సోషల్ మెసేజ్ అన్నీ రవితేజ స్టైల్‌లో ఉంటే ఎలా ఉండేదో అనే కుతూహలం మొదలైంది.
ఇక ‘మాస్ జాతర’ విషయానికి వస్తే.. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, మాస్ యాక్షన్, కామెడీ అన్నీ కలిపి ప్యాకేజీగా ఈ సినిమా రానుందని టాక్. భాను భోగవరపు దర్శకత్వం, రవితేజ ఎనర్జీ కలిస్తే హిట్టే అని అభిమానులు నమ్ముతున్నారు. మొత్తానికి వెంకీ అట్లూరి చెప్పిన ఈ కామెంట్ వల్ల ఇప్పుడు నెటిజన్లు “ధనుష్ ప్లేస్‌లో రవితేజ ఉంటే సార్ సినిమాకి మరో రేంజ్ వచ్చేది” అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అక్టోబర్ 3న విడుదల కాబోతున్న మాస్ జాతర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మాత్రం ఆకాశాన్ని తాకుతోంది.