రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ వంటి డీసెంట్ హిట్ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి ఫెయిల్యూర్ అనంతరం ఇప్పుడు ‘కింగ్ డమ్’ మూవీతో వస్తున్నారు . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ విడుదలకు ఇక మాత్రం 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
Also Read : SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి మూవీపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా తాజాగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 26న సాయంత్రం 5:00 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నాట్లుగా ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి సినిమా టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన రావడంతో, ట్రైలర్‌పై ఆసక్తి అమాంతం పెరిగింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ మేజర్ హైప్‌ను సృష్టించేలా కనిపిస్తోంది.
In 7 Days – the world of #KINGDOM will be all yours!
In 2 days – #KingdomTrailer 🤗 pic.twitter.com/NUMibY3pnS
— Vijay Deverakonda (@TheDeverakonda) July 24, 2025