విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం నేడు ప్రిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది..
సూరిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ బాగుంది. పాత్రలను పరిచయం సన్నివేశాలు చక్కగా డీల్ చేసి, ఆపై ఎటువంటి ల్యాగ్ లేకుండా కథలోకి వెళ్లాడు దర్శకుడు. కానీ ఇక్కడ కథలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ అది చాలా వరకు పాజిబుల్ గానే ఉంటుంది. జైల్ సీక్వెన్స్ లో సూరీ గా విజయ్ అదరగొట్టాడు. శ్రీలంక అడవి, జాఫ్నా జైళ్ల నేపథ్యం సూపర్ గా ఉంది. ఫస్టాప్ ను డీసెంట్ గానే డీల్ చేసి సెకండాఫ్ కు సెటప్ పర్ఫెక్ట్ గా సెట్ చేసాడు.
ఇక సెకండాఫ్ ప్రారంభం సూపర్ గా స్టార్ట్ అవగా కొద్దిసేపటికి కథ గాడీ తప్పుతుంది. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదరగొట్టాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కధనం కాస్త నెమ్మదిగా అక్కడక్కడ కాస్త బోరింగ్ గా సాగుతుంది ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా పుంజుకుంటుంది. ఇక సాలిడ్ క్లైమాక్స్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చి ముగించారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు అనిరుథ్ టెర్రిఫిక్ బీజిఎమ్.. నిర్మాణ విలువలు టాప్ క్లాస్.. చాలా కాలంగా హిట్ లేని విజయ్ దేవరకొండకు కింగ్డమ్ కాస్త ఊరటనిచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.