వరుస ప్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రజనీకాంత్ 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన జైలర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ జైలర్ నుండి సూపర్ స్టార్ ఓ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. తన సినిమాల్లో కచ్చితంగా ముగ్గురు, నలుగురు స్టార్ హీరోలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు ఎంగ్జాంపుల్స్ వెట్టయాన్, కూలీ, ఇప్పుడు రాబోతున్న జైలర్ 2. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలతో అదరగొట్టేశారు. మార్కెట్ పరంగా వర్కౌట్ కావడంతో రజనీతో పాటు ఫిల్మ్ మేకర్లు.. ఇదే ఫార్ములాను అప్లే చేస్తున్నారు.
Also Read : Sharwa38 : చార్మింగ్ స్టార్ సినిమాలో సొట్ట బుగ్గల సుందరి
ఎన్నో అంచనాలతో లాస్ట్ ఇయర్ థియేటర్లలో పలకరించి బోల్తా పడ్డ వెట్టయాన్‌లో కూడా సూపర్ స్టార్ కాకుండా మరో ఇద్దరు కీ రోల్ ప్లే చేశారు. రానా నెగిటివ్ రోల్ చేయగా అమితాబచ్చన్, ఫహాద్ ఫజిల్ మెస్మరైజ్ చేశారు. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారు డైరెక్టర్లు. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ కూడా కూలీ కోసం సుమారు అరడజను మంది హీరోలతో వర్క్ చేశాడు. నాగార్జున, ఉపేంద్ర, సాబిన్ షాహీర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లను ప్రాజెక్టులో ఇన్ బిల్ట్ చేసి సినిమాపై అంచనాలను ఎవరెస్టును తాకిస్తున్నాడు . రిజల్ట్ తేలాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయక తప్పదు మరి. కూలీ తర్వాత రజనీ కాంత్ చేస్తోన్న ప్రాజెక్ట్ జైలర్ 2 ఇప్పటికే స్టార్టైంది. ఈసారి భారీ లెవల్లో స్కెచ్ వేస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. వెయ్యి కోట్లే లక్ష్యంగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రాజెక్టుకు కావాల్సిన అదనపు హంగులు, ఆర్బాటాలు సిద్ధం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే జైలర్‌లో వర్క్ చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌లను ఈ సినిమా కోసం పట్టుకొస్తున్నాడట. అలాగే బాలకృష్ణను అప్రోచ్ అయ్యాడని టాక్. ఇప్పుడు రంగంలోకి మరో హీరో ఎంటరయ్యాడు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్‌ను కూడా జైలర్ 2కి తీసుకురాబోతున్నాడన్నది లేటేస్ట్ బజ్. గతంలో వెట్టయాన్‍లో ఈ ఇద్దరు నటించగా ఇప్పుడు ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నారట.