చిత్ర పరిశ్రమలో కొందరి హీరోయిన్లకు సినిమా ఫలితాలతో సంబంధం ఉండదు. ఎన్ని ఫ్లాపులు పలకరించినా వారి ట్యాలెంట్ ముందు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్. కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా, తాజాగా టాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్‌ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘భోళా శంకర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో, ఆమె తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. కేవలం తెలుగే కాదు, ఇటీవల వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ఆమె తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్క హిట్ కూడా లేకపోయినా, ఆమెకున్న ప్రతిభ, స్టార్డమ్ కారణంగా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
Also Read:Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
తాజాగా కీర్తి సురేష్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేశారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘రాజావారి రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈనెల 11న (అక్టోబర్ 11) పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. అనంతరం, అక్టోబర్ 16 నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వరుస అపజయాలతో ఉన్న కీర్తి సురేష్ కెరీర్‌కు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో సినిమా పడటం కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంతోనైనా కీర్తి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.