చిత్ర పరిశ్రమలో కొందరి హీరోయిన్లకు సినిమా ఫలితాలతో సంబంధం ఉండదు. ఎన్ని ఫ్లాపులు పలకరించినా వారి ట్యాలెంట్ ముందు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్. కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా, తాజాగా టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవితో…