Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్‌కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Also Read
అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్‌కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’. నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో కయాదు లోహర్ ‘సుబ్బలక్ష్మి’ అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇలా కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే మూడు సినిమాలతో కయాదు లోహర్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘డ్రాగన్’ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ ఫ్లాపులతో కాస్త వెనుకబడిన ఆమె కెరీర్‌కు ఈ మూడు సినిమాలు ఎలాంటి టర్నింగ్ పాయింట్‌గా మారతాయనేది ఆసక్తికరంగా మారింది. మరి సెప్టెంబర్ కయాదు లోహర్‌కు కలిసొచ్చి.. ఆమె ఫ్లాప్ లెక్కలను సరిచేస్తుందా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!