స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. నిజానికి అదే రోజున బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాను రంగంలోకి దించుతూ ఉండడం గమనార్హం. “వా వాతియార్” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ సినిమాగా దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : MBU: ఇది కోర్టు ధిక్కరణ..యూనివర్సిటీ రద్దు ప్రచారంపై కీలక ప్రకటన
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి నటిస్తున్న “వా వాతియార్” సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కార్తి కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా “వా వాతియార్” నిలుస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.