హీరోయిన్ రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత ఆమె తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు షో లలో జెర్జ్‌గా వ్యావహరించింది. అలాగే చాలా రోజులకు రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయితే రేణు దేశాయ్ ఉంటే రేణు దేశాయ్ జంతువుల కోసం, చిన్న పిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Thammudu : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..
తనకూ తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళం అడుగుతూ తనకు తోచిన సాయం చేస్తుంటుంది. ఇందులో భాగంగా తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రముఖ రచయిత థామస్ పైన్ చెప్పిన ఓ స్ఫూర్తిదాయకమైన మాటను పంచుకుంది.. ‘నిజాయితీగా ఉండాలంటే, కొంత మందిని నొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా నొప్పించడానికి భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు’ అనే క్యాప్షన్ ను పోస్ట్‌లో షేర్ చేసింది. అయితే రేణు దేశాయ్ ఈ పోస్ట్‌ను ఎవర్ని ఉద్దేశించి పెట్టింది అనేది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.