Karmasthalam: ఆసక్తికరంగా పాన్ ఇండియా ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ..”ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. 2022 లో కాశ్మీర్ స్టోరీస్ వచ్చింది, 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది, అలాగే చావా, రజాకార్ ఇలా కొన్ని సినిమాలు మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పాయి.
నేను చిన్నపాటి నుంచి చదువుకున్న దాంట్లో తెలియని ఎన్నో కథలను సినిమాలు చూసి తెలుసుకున్నాను. మన హిందూ ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియడానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీగా వుంది. ఇది ఇంతటితో ఆగదు కర్మస్థలం తరువాత కుంభస్థలం వస్తుందని అన్నారు. డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా ఉన్నాయి. ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిషాసుర మర్దిని. అందరికీ మోషన్ పోస్టర్ నచ్చింది అనుకుంటున్నాను.నేను ఎంత ప్యూర్ గా నమ్మానో అంత మంచిగా ఈ సినిమా చేశాను. అందరు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను.” అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!