Site icon NTV Telugu

Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్‌ 1’ 1000 కోట్ల మార్క్‌ను అడ్డుకున్న నిర్మాతలు?

Kantara Chapter 1 Ott

Kantara Chapter 1 Ott

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్‌ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే, సినిమా కలెక్షన్లను అమాంతం అడ్డుకున్నది, వెయ్యి కోట్ల క్లబ్‌ ఛాన్స్‌ను లేకుండా చేసింది మరెవరో కాదు… స్వయంగా నిర్మాతలు తీసుకున్న ఒక నిర్ణయమేననే చర్చ నడుస్తోంది.

Also Read :Pawan-Kalyan : పవన్ కళ్యాణ్‌కి భారీ అడ్వాన్స్‌.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్‌!

సినిమా విడుదలైన కేవలం 4 వారాలకే (అక్టోబర్ 31న) ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా కేవలం 3 రోజుల్లో ఓటీటీలోకి వస్తుండటంతో, థియేటర్లలో కలెక్షన్లు తగ్గకున్నా… ఆడియన్స్ మాత్రం “ఇంకా 3 రోజుల్లో ఓటీటీలో చూద్దాం” అనే ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి, ఇప్పటికీ హిందీలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న తరుణంలో, ఈ ఓటీటీ ఒప్పందం ‘కాంతార’ వెయ్యి కోట్ల ఆశలపై నీళ్లు చల్లింది అని విశ్లేషకులు అంటున్నారు. ‘కాంతార చాప్టర్‌ 1’ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం కష్టమేనా అనే సందేహాన్ని ఈ నిర్ణయం రేకెత్తించింది. సాధారణంగా, భారీ హిట్‌ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఎక్కువ సమయం ఇస్తుంటారు.

Also Read :Droupadi Murmu: పాక్‌ తప్పుడు ప్రచారాలకు రాష్ట్రపతి చెక్.. ధీశాలి “శివాంగి సింగ్‌”తో ద్రౌపది ముర్ము ఫొటో వైరల్..

హిందీ నిర్మాతలు చాలావరకు ఓటీటీలోకి రావడానికి 8 వారాల సమయాన్ని తీసుకుంటున్నారు. ఇటీవల మలయాళంలో 301 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన భారీ హిట్ ‘లోక’ సైతం, విడుదలైన 8 వారాల తర్వాతే అక్టోబర్ 31న ఓటీటీలోకి వస్తోంది. కానీ, ‘కాంతార’ విషయంలో కేవలం 4 వారాలకే ఓటీటీ ఒప్పందం కుదరడం వెనుక, నిర్మాతలు మరింత ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతోనే ఈ త్వరితగతిన ఒప్పందాన్ని చేసుకున్నారని భావించవచ్చు. ఏదేమైనా, సినిమా బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, కేవలం 4 వారాలకే ఓటీటీలోకి రావడం, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడానికి ఒక అడ్డంకిగా మారిందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Exit mobile version