Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్ల మార్క్‌ను అడ్డుకున్న నిర్మాతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే, సినిమా కలెక్షన్లను అమాంతం అడ్డుకున్నది, వెయ్యి కోట్ల క్లబ్ ఛాన్స్‌ను లేకుండా చేసింది మరెవరో కాదు… స్వయంగా నిర్మాతలు తీసుకున్న ఒక నిర్ణయమేననే చర్చ నడుస్తోంది.
Also Read :Pawan-Kalyan : పవన్ కళ్యాణ్‌కి భారీ అడ్వాన్స్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్!
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
సినిమా విడుదలైన కేవలం 4 వారాలకే (అక్టోబర్ 31న) ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా కేవలం 3 రోజుల్లో ఓటీటీలోకి వస్తుండటంతో, థియేటర్లలో కలెక్షన్లు తగ్గకున్నా… ఆడియన్స్ మాత్రం “ఇంకా 3 రోజుల్లో ఓటీటీలో చూద్దాం” అనే ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి, ఇప్పటికీ హిందీలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న తరుణంలో, ఈ ఓటీటీ ఒప్పందం ‘కాంతార’ వెయ్యి కోట్ల ఆశలపై నీళ్లు చల్లింది అని విశ్లేషకులు అంటున్నారు. ‘కాంతార చాప్టర్ 1’ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం కష్టమేనా అనే సందేహాన్ని ఈ నిర్ణయం రేకెత్తించింది. సాధారణంగా, భారీ హిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఎక్కువ సమయం ఇస్తుంటారు.
హిందీ నిర్మాతలు చాలావరకు ఓటీటీలోకి రావడానికి 8 వారాల సమయాన్ని తీసుకుంటున్నారు. ఇటీవల మలయాళంలో 301 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన భారీ హిట్ ‘లోక’ సైతం, విడుదలైన 8 వారాల తర్వాతే అక్టోబర్ 31న ఓటీటీలోకి వస్తోంది. కానీ, ‘కాంతార’ విషయంలో కేవలం 4 వారాలకే ఓటీటీ ఒప్పందం కుదరడం వెనుక, నిర్మాతలు మరింత ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతోనే ఈ త్వరితగతిన ఒప్పందాన్ని చేసుకున్నారని భావించవచ్చు. ఏదేమైనా, సినిమా బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, కేవలం 4 వారాలకే ఓటీటీలోకి రావడం, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడానికి ఒక అడ్డంకిగా మారిందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!