కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా గడచిన రాత్రి పిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయింది
Also Read : Pawan Kalyan : ఓజీ సినిమా కథ ఇప్పటికీ నాకు తెలియదు : పవర్ స్టార్
ఈ సినిమా ప్రీమియర్స్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. పెట్టిన రూపాయికి న్యాయం చేశాడు రిషబ్. అలాగే టెక్నికల్ గా ‘వావ్’ అనేలానే ఉంది కాంతార. అటవీ నేపథ్యాన్ని తెరపై చాలా అందంగా, సహజంగా చూపించాడు దర్శకుడు రిషబ్. అలాగే ‘గార్డియన్ ఆఫ్ కాంతారా’ పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో రిషబ్ నటనకు చాలా అవార్డులను గెలుచుకోవడం ఖాయం. ఒక అవతార్ నుండి మరొక అవతార్‌కు మారినపుడు రిషబ్ నటన అద్భుతం అనే టాక్ వినిపిస్తోంది. రిషబ్ శెట్టి టాప్ నాచ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ 30 నిమిషాలు రిషబ్ శెట్టి జీవించేసాడు. ఒక నటుడిగా దర్శకుడిగా రిషబ్ ఈ సినిమా కోసం పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. తానూ రాసుకున్న ప్రతి పాయింట్ ను అంతే డిటైల్ గా తెరపై మలిచాడు. సినిమా చూసిన ఆడియెన్స్ చెప్పే ఒకే ఒక మాట శెభాష్ రిషబ్. అలానే హ్యాట్సఫ్ టు యువర్ డెడికేషన్.