ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వలో నటించిన ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘కాంతార 2’ మొదలైనప్పటి నుండి ఆ మూవీకి సంబంధించి ఏదో ఒక విషాద వార్త వింటున్నే ఉన్నాము. ఆ మధ్య బస్సు ప్రమాదం, రీసెంట్‌గా జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించడం. ఇక ఇప్పుడు.. ‘కాంతార2’లో కీలక పాత్ర పోషించిన నటుడు రాకేశ్ పూజారి (34) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ, తుళు భాషల్లో పలు చిత్రాలలో నటించి మెప్పించిన రాకేశ్ ‘కాంతార 2’ లో తన పాత్రకు సంబంధించిన సీన్స్ ఆయన ఇటీవల పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇది ఎలా జరిగింది అంటే..
Also Read : Ram Charan : ‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్
రీసెంట్ గా రాకేష్ తన స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరయ్యాడట.. మెహిందీ ఫంక్షన్‌లో ఉన్నట్లుండి గుండె పోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే కన్నుమూశాడు. మెహందీ వేడుకలో దిగిన ఫొటోలని పోస్ట్ చేశాడు, అనంతరం సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడట. ఇది జరిగిన కాసేపటికే రాకేష్ కన్నుమూశారు. కాగా కార్కల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణం కింద కేసు నమోదైంది. దీంతో రాకేశ్ మృతి పట్ల కాంతార 2 హీరో రిషబ్ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ‘మిత్రమా.. మళ్లీ జన్మించు. కాంతారలో నీ పాత్ర, ఆ పాత్రలో నటించే క్రమంలో నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. నీ లోటు ఎవరూ తీర్చలేనిది’ అంటూ రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.