తన డ్రీం ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకున్న కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విష్ణు కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమా చాలా కాలం పాటు ప్రీ-ప్రొడక్షన్ అలాగే పోస్ట్-ప్రొడక్షన్ పనులలో ఉండిపోవాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో చాలా మంది టాప్ స్టార్స్ నటించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, ముకేశ్ రిషి వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.
Also Read:Dil Raju: దిల్ రాజు బయోపిక్ లో హీరోగా నితిన్?
నిజానికి వీరిలో చాలా మంది డేట్స్ ఇస్తే చాలని అనుకుని దర్శకనిర్మాతలు ఈ రోజుకూ ఉన్నారు. అయితే, వీరిలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఇప్పటికే మంచు విష్ణు సహా మోహన్ బాబు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. బుజ్జిగాడు సినిమా సమయంలో మోహన్ బాబు, ప్రభాస్ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమాను ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మోహన్‌లాల్ కూడా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. అదేవిధంగా, తమిళనాడు నుంచి వచ్చి నాదనాథుడు అనే పాత్ర చేసిన శరత్ కుమార్ కూడా ఈ సినిమా కోసం ఒక రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.
Also Read:Dil Raju: నితిన్, స్టార్ అవుతావ్ అనుకున్నా.. కాలేక పోయావ్!
అక్షయ్ కుమార్ మాత్రం రోజుకు రెండు కోట్ల చొప్పున ఐదు రోజులకు గాను 10 కోట్లు చార్జ్ చేశాడట. కాజల్‌కు కూడా నామమాత్రపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ భాగం షూట్ మీదే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ కోసం దానికి డబుల్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. టెక్నీషియన్లకు మంచి పే ఇచ్చారని, అదేవిధంగా ప్రమోషన్స్ మీద కూడా గట్టిగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మొత్తం మీద, నటీనటులకు పెద్దగా ఖర్చు పెట్టకుండా కంటెంట్ మీదే మంచు విష్ణు ఫోకస్ చేయడం గమనార్హం.
