Kannappa : ప్రభాస్ ఫోటో లీక్ చేసిన వారిని పట్టుకుంటే 5 లక్షలు : మంచు విష్ణు
- మంచు విష్ణు పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్ప
- భారీ బడ్జెట్ పై తెరకెక్కిస్తున్న మోహన్ బాబు
- రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాత, హీరో మంచు విష్ణు లెటర్ రిలీజ్ చేసారు. అందులో ” కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి.. ప్రియమైన ప్రభాస్ అభిమానులు మరియు అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్దతతో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి మా టీమ్ నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి క్షణంలో కన్నప్ప సినిమా నుంచి ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇమేజ్ అనధికారంగా లీక్ అయినందుకు చాలా బాధ పడుతున్నాము, చింతిస్తున్నాము.
Also Read : Rebal Star : మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని ప్రభాస్ ఫోటో లీక్
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ప నిరంతరం కృషి చేస్తున్న 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ లీక్ ఎలా జరిగింది అనేది కనుగొనేందుకు మేము పోలీస్ కేసు పెట్టడం జరుగుతోంది. ఈ లీక్ అయిన ఇమేజ్ ఫుటేజ్ ను ఎవరైనా షేర్ చేస్తూ ఉంటే, ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీనిని షేర్ చేయడం ద్వారా, చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. ఈ లీక్ చేసిన వారిని ఎవరైనా కనుగొంటే, వారికి 5,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్కు డైరెక్ట్గా మెసేజ్ పంపండి అని ప్రార్ధిస్తున్నాము. ప్రేమ మరియు నిబద్ధతతో పుట్టిన ఈ ప్రాజెక్ట్ INTEGRITYని కాపాడటానికి మీ సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ సినిమా స్ఫూర్తిని కాపాడటంలో మాతో చేతులు కలపండి” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!