Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా సినిమాకూ వైవిధ్యం చూపుతూ, నవతరం దర్శకులతో అద్భుతమైన ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకుంటున్న ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, రీసెంట్గా ‘సిద్ధా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సరికొత్త చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సంచలన ప్రాజెక్టును ఆర్.కె.ఎఫ్.ఐ తో పాటు ప్రముఖ నిర్మాత ఆర్. మహేంద్రన్, టర్మెరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘విక్రమ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజ్ కమల్ సంస్థ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కమల్ హాసన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సరికొత్త చిత్రంపై ఇండస్ట్రీలో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అరుణ్ కుమార్ కథలు సాధారణంగా చాలా గ్రౌండెడ్‌గా, ఎమోషనల్‌గా, బలమైన పాత్రల చుట్టూ అల్లుకుని ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ డ్రైవెన్ డైరెక్టర్‌కు, కమల్ హాసన్ లాంటి విశ్వనటుడు తోడైతే వెండితెరపై ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. కమల్ ఇమేజ్‌కు సరిపోయే ఒక పవర్ ఫుల్ పోలీస్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ను అరుణ్ కుమార్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న దిగ్గజ నటుడు, ఓ సెన్సిబుల్ యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!