కొన్నాళ్ళ క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సురేఖ వాణి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత కన్ఫర్మ్ చేశారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి అందులో కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. అంతే కాదు సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను, అన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నీ బాధలు నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్న.. నీకు ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నా, దయచేసి వెనక్కి వచ్చేయ్ అన్న, మిస్ యు కెపి అన్న. నువ్వు ఎక్కడున్నా టైగర్ ఏ అంటావుగా, ఐ లవ్ యు సో మచ్ అన్న. రెస్ట్ ఇన్ పీస్ అన్న అంటూ సుప్రీత రాసుకొచ్చింది.
Bunny Vasu: అల్లు అర్జున్ కి తప్పుడు సలహాలు.. స్పందించిన బన్నీ వాసు
అయితే అసలు కేపీ చౌదరి ఎలా కన్నుమూశారు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అప్పట్లో జరిగిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆయన పేరు ప్రధానంగా వినిపించింది ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి ఫోటోలు దిగిన సురేఖవాణి సహా ఆమె కుమార్తె పేర్లు కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. ఇక ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి, తాజాగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో గోవాలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈరోజు ఉదయం పోలీసులు వెళ్లి గది తలుపులు తెరిచి చూసేసరికి కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.