Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమాభిమానాలు ఎప్పుడూ ప్రత్యేకం. అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే తారక్, తాజాగా చేసిన ఓ పని ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది..గతంలో ‘దేవర’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద కనిపించిన ఓ దివ్యాంగుడైన అభిమాని (మాట్లాడలేడు, వినలేడు) తారక్‌ను చూడాలన్న తపనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వీరాభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్, హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతడిని ప్రత్యేకంగా తన కారవాన్‌లోకి పిలిపించుకుని ముచ్చటించారు.
నిజానికి ఎన్టీఆర్ చేతికి తీవ్ర గాయమై ఆర్మ్ స్లింగ్ (చేతికి సపోర్టివ్ బెల్ట్) ధరించి ఉన్నారు. ఆ అభిమాని కారవాన్‌లోకి రాగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి, సైగల ద్వారానే అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫొటో దిగే సమయంలో, చేతి కట్టు అడ్డుగా ఉండకూడదన్న ఉద్దేశంతో, ఎంతో నొప్పితో కూడిన గాయం ఉన్నప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా ఆ స్లింగ్‌ను స్వయంగా తొలగించేశారు. అంతేకాకుండా, ఆ అభిమానిని ఆత్మీయంగా హత్తుకుని నిండు మనసుతో కౌగిలించుకున్నారు. అభిమాని కూడా ఎన్టీఆర్‌ను ప్రేమతో ముద్దాడటంతో ఆ దృశ్యం చూసిన వారంతా భావోద్వేగానికి గురయ్యారు. చేతి నొప్పిని సైతం లెక్కచేయకుండా ఓ దివ్యాంగ అభిమానిపై తారక్ చూపించిన ఈ సాటిలేని ప్రేమ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
Also Read
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
తాజావార్తలు
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!