ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఈ సందర్భంగా తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా సక్సెస్ అనేది ఎంటైర్ టీమ్‌కు సంబంధించింది. అయితే ‘ఆయ్’ సక్సెస్ వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన గీతాఆర్ట్స్ సంస్థకు, దర్శకుడు అంజి కె.మణిపుత్రకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నయన్ సారిక.
Also Read: OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే..
‘ఆయ్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లను కలుసుకున్నారు. సినిమా సక్సెస్‌పై ఇద్దరూ స్టార్స్ టీమ్ సభ్యులను అభినందించారు. అలాగే నయన్ సారిక నటనను ప్రశంసించారు. ‘‘సినిమాలో చాలా ఈజ్‌తో నా క్యారెక్టర్‌లో నటించానని గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభినందించారు. అల్లు అర్జున్ అయితే నన్ను దక్షిణాది అమ్మాయి అనే అనుకున్నారు. కాదని తెలిసి అంత చక్కగా పాత్రలో ఒదిగిపోయినందుకు ఆశ్చర్యపోయారు. కళ్లతో చక్కగా హావభావాలను పలికిస్తానని అల్లు అరవింద్ ప్రశంసించారు. అంత పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు రావటం నాకెంతో గొప్పగా అనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది నయన్ సారిక.ఆయ్ సక్సెస్ తో టాలీవుడ్ లో అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.