NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ లైనప్ ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఎంత బిజీగా ఉన్నా తన పర్సనల్ లైఫ్‌కు, ఫ్యామిలీకి టైమ్ కేటాయించడంలో తారక్ ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పుట్టిన రోజున ఎన్టీఆర్ తన ఇంట్లోకి రెండు సరికొత్త రంగురంగుల పెట్స్ (మకావ్ జాతికి చెందిన పక్షులు)ను పరిచయం చేశారు. నెరిసిన గడ్డం, స్లీవ్‌లెస్ టీషర్టుతో సరికొత్త రగ్గడ్ లుక్‌లో ఉన్న తారక్.. నేలపై కూర్చుని ఆ పక్షులతో సరదాగా గడుపుతున్న పిక్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఒక పక్షి ఆయన చేతిపై వాలగా, మరొకటి కింద ముద్దుగా చూస్తూ కూర్చుంది.
ఈ బర్డీస్ను పరిచయం చేస్తూ తారక్ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాటికి ఆయన ‘అసాహి’ (Asahi – 朝日), ‘యూహి’ (Yuuhi – 夕日) అని పేర్లు పెట్టారు. జపనీస్ భాషలో ‘అసాహి’ అంటే ఉదయించే సూర్యుడు (సూర్యోదయం) అని, ‘యూహి’ అంటే అస్తమించే సూర్యుడు (సూర్యాస్తమయం) అని అర్థం. జపాన్ దేశంపై, అక్కడి సంస్కృతిపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకునేందుకే తన ముద్దుల పక్షులకు ఈ జపనీస్ పేర్లను పెట్టినట్లు ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల సమయం నుండి జపాన్ ఆడియన్స్‌తో తారక్‌కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాండింగ్‌ను ఇలా తన ఇంట్లోని కొత్త అతిథుల రూపంలో ఆయన గుర్తుచేసుకోవడం విశేషం.
Also Read
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
తాజావార్తలు
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!