జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యమేవ జయతే 2’. తొలి చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ న్యూ ఇన్ స్టాల్మెంట్ నిజానికి ఏప్రెల్ లోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. సల్మాన్ ‘రాధే’ సినిమాతో ‘సత్యమేవ జయతే 2’ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. ‘రాధే’ ఓటీటీ బాట పట్టగా ‘సత్యమేవ జయతే 2’ ఇంకా పెండింగ్ లో ఉంది. ముంబైలో ఈ మధ్యే లాక్ డౌన్ ఆంక్షలు సడలించి మళ్లీ షూటింగ్స్ కి అనుమతినివ్వటంతో ‘సత్యమేవ జయతే 2’కు సంబంధించి కొద్దిపాటి పెండింగ్ వర్క్ పూర్తి చేశారు.
Read Also : కార్తీక్ మరో సుశాంత్ అవుతాడా!?
చిత్రీకరణ పూర్తి కావటంతో ఇప్పుడు జాన్ అబ్రహాం, దివ్య కోస్లా కుమార్ స్టారర్ ని థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జాన్ అబ్రహాం డ్యుయెల్ రోల్ చేస్తోన్న ‘సత్యమేవ జయతే 2’లో ఇంకా మనోజ్ బాజ్ పాయ్, అమైరా దస్తూర్, గౌతమీ కపూర్ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.