Site icon NTV Telugu

Jayam Ravi: నెలకి 40 లక్షల భరణం వార్తలు.. స్టార్ హీరో భార్యకి కౌంటర్

Ravimohan

Ravimohan

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది (2024)లో వీరి విడాకుల ప్రకటనతో మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా, చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రవి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read:A22 x A6: హైదరాబాద్‌ చేరుకున్న అట్లీ.. ఐకాన్‌స్టార్‌తో ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్‌

2009లో వివాహబంధంతో ఒక్కటైన రవి మోహన్, ఆర్తి దంపతులు, 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024లో విడిపోతున్నట్లు రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన తన సమ్మతి లేకుండా జరిగిందని ఆర్తి ఆరోపించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల నుంచి సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో ఈ వివాదం మరింత ఉధృతమైంది. రవి మోహన్ తన భార్య ఆర్తిని ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఇబ్బంది పెట్టారని, తన పిల్లల బాధ్యతలను విస్మరించారని ఆర్తి ఆరోపిస్తే, ఆర్తి తనను ఇంటి నుంచి గెంటేసి, పిల్లలతో కలవనీయకుండా చేశారని రవి ఆరోపించారు.

Also Read:Keeravani : పవన్ కళ్యాణ్ కార్చిచ్చు…ఎంత వాన పడినా ఆగేది లేదు!

మే 21, 2025న చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిమాండ్‌ను ఎద్దేవా చేస్తూ రవి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఫోన్‌లో మాట్లాడుతున్న ఫోటోతో “సమాచారం వచ్చింది” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఆర్తి డిమాండ్‌కు స్పందనగా భావిస్తూ నెటిజన్లు, అభిమానులు దీన్ని ఎగతాళిగా చూస్తున్నారు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో, రవి-ఆర్తి వివాదం మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. రవి మోహన్, ఆర్తి మధ్య విడాకుల వివాదం సినీ పరిశ్రమలోనే కాక, సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.

Exit mobile version