సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ట్రైబల్స్’ అనే పదం ఉపయోగించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఆదివాసీలను ఉద్దేశించినవి కావని, అదే కమ్యూనిటీకి చెందిన ఒక లాయర్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు.
Also Read: Sumanth : అక్కినేని ఇంట మోగనున్న మరో పెళ్లి బాజా.. !
“రెట్రో ఆడియో లాంచ్ కార్యక్రమంలో నా వ్యాఖ్య కొంతమందిలో ఆందోళన కలిగించిందని తెలిసింది. నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.. ఏ కమ్యూనిటీనీ, ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం లేదా లక్ష్యంగా చేయడం నా ఉద్దేశం కాదు. వారిని గౌరవిస్తాను, మన దేశంలో అంతర్భాగంగా భావిస్తాను. నేను ఐక్యత గురించి, భారతదేశం ఒకటని, ప్రజలందరూ ఒకటని, కలిసి ముందుకు సాగాలని మాట్లాడాను. ఒక దేశంగా ఐక్యంగా నిలబడాలని కోరుతూ మాట్లాడిన నేను వివక్ష చూపుతానా? ‘తెగ’ అనే పదాన్ని చారిత్రక, నిఘంటు కోణంలో ఉపయోగించాను. శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలుగా వ్యవస్థీకృతమై ఉండేది. ఇది షెడ్యూల్డ్ తెగల వర్గీకరణ గురించి కాదు. ఆంగ్ల నిఘంటు ప్రకారం, ‘తెగ’ అంటే: సామాజిక, ఆర్థిక, మత లేదా రక్త సంబంధాలతో ముడిపడిన కుటుంబాలు లేదా సంఘాలతో కూడిన సాంప్రదాయ సమాజంలో సామాజిక విభజన. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోబడినా లేదా బాధ కలిగించినా, హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి, పురోగతి, ఐక్యత గురించి మాట్లాడటమే నా లక్ష్యం. నా వేదికను ఉద్ధరించడానికి, ఏకం చేయడానికి కట్టుబడి ఉన్నాను, విభజించడానికి కాదు.” అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.