Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫిలింనగర్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారడంతో, తాజాగా ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు నిజాలను వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. “నిన్న మా డాన్సర్స్ అసోసియేషన్ యూనియన్ సమస్యలపై ఒక అంతర్గత చర్చ జరిగింది. అయితే కొందరు శేఖర్ మాస్టర్ కి, నాకు మధ్య గొడవ జరిగిందని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అలాంటిది ఏమీ జరగలేదు. మేమందరం తోబుట్టువుల్లాంటి వాళ్లం, సోదరులం. ఇక్కడ ఉన్నవాళ్లంతా మంచి వ్యక్తులే. ప్రతి ఒక్కరం యూనియన్ బాగు కోసమే శ్రమిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదంపై వస్తున్న వార్తలు చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించినట్లు జానీ మాస్టర్ తెలిపారు. “మా గొడవల గురించిన వార్తలు చూసి చిరంజీవి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను, శేఖర్ మాస్టర్ కలిసి చిరంజీవి సినిమా షూటింగ్‌లోనే కలిశాం. అక్కడ ముగ్గురం కూర్చుని పాత సూపర్ హిట్ పాటల గురించి ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం” అని జానీ మాస్టర్ వెల్లడించారు. సినీ పరిశ్రమలోని మాస్టర్స్ అందరికీ, ప్రతిభ గల డాన్సర్లందరికీ మెగాస్టార్ చిరంజీవి గారే రియల్ ఇన్స్పిరేషన్ అని జానీ మాస్టర్ కొనియాడారు. చిరు ఎప్పుడూ తమలోని టాలెంట్‌ను గుర్తిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారని చెప్పారు. పరిశ్రమలోని హీరోలందరూ, మాస్టర్స్ అందరూ తమకు పూర్తి సపోర్ట్ అందిస్తారని తెలిపారు. యూనియన్ సమావేశంలో జరిగిన చర్చకు, శేఖర్ మాస్టర్‌కు అసలు ఎలాంటి సంబంధం లేదని జానీ మాస్టర్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అసోసియేషన్‌లో ఉండే కొన్ని చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం మాత్రమే అక్కడ చర్చలు జరిగాయని, దాన్ని కొందరు కావాలనే పెద్ద వివాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వివరణతో టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్లయింది.
Also Read
తాజావార్తలు
-
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!