Jani Master Absconding News: తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింద తాను మైనర్ గా ఉన్నప్పుడే ఒక ముంబై హోటల్లో అత్యాచారం చేశారంటూ. అతని దగ్గర గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు రేప్ జరిగిందని చెబుతున్న సమయంలో ఆమె మైనర్ గా ఉందని అందుకే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసులకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారని పేర్కొంటున్న పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను జానీ మాస్టర్ ని వెతికేందుకు రంగంలోకి దించారు.
Actor Ali : జానీ మాస్టర్ వ్యవహారంపై అలీ రియాక్షన్..
నార్త్ ఇండియాలో జానీ మాస్టర్ ఉన్నాడు అని తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులను బురిడీ కొట్టించి అక్కడి నుంచి ఆయన పరారైనట్లుగా తెలుస్తోంది. రేప్ తో పాటు రేప్ అటెంప్ట్ తో పాటు ఇపుడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ లో ఉన్నాడని విషయం తెలిసి హైదరాబాద్ నుంచి ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్న సంగతి తెలిసి అక్కడి నుంచి జానీ మాస్టర్ పరారయినట్లుగా సమాచారం. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క అన్నట్టు ఈ కేసు తయారైంది. ఎందుకంటే పోక్సో చట్టం ప్రకారం ముందుగా ఎలాంటి విచారణ చేయకుండానే ఇప్పుడు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ అరెస్ట్ చేస్తారా లేక ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోతారా అనేది తెలియాల్సి ఉంది.